అప్పుడే ఓటీటీలోకి వస్తున్న 100 కోట్ల సినిమా!
- జూన్ 14న విడుదలైన 'మహారాజ'
- 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా
- స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
- ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్
తెలుగు .. తమిళ భాషల్లో విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మహారాజ', జూన్ 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను విడుదలైన ఈ సినిమా, అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక్కడ కూడా ఈ సినిమా చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయినవాళ్లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా అని కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను తమిళంతో పటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథానాయకుడు, ఒక ప్రమాదంలో తన భార్యను కోల్పోతాడు. తన కూతురును కాపాడుకోవడం కోసం అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేదే కథ. మమతా మోహన్ దాస్ .. అనురాగ్ కశ్యప్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.