బ్యాంకు నుంచి ఒక సెంట్ విత్ డ్రా చేసేందుకు యత్నం.. దోపిడీ అభియోగాలపై అరెస్ట్

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • ఒక సెంట్ డ్రా చేసేందుకు విత్ డ్రా స్లిప్ అందించిన ఫ్లెమింగ్
  • సెంట్ డ్రా చేయడం కుదరదన్న బ్యాంక్ టెల్లర్
  • ఫ్లెమింగ్ ప్రతిస్పందనకు భయపడిపోయి పోలీసులకు ఫోన్
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి ఒక సెంట్ విత్ డ్రా చేసుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దోపిడీ అభియోగాలపై అరెస్ట్ అయిన అతడు ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. మైఖేల్  ఫ్లెమింగ్ (41) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెంట్రల్ ఫ్లోరిడాలోని చేజ్ బ్యాంక్‌లోకి వెళ్లి ఒక సెంట్ డ్రా చేసుకునేందుకు బ్యాంక్ టెల్లర్‌కు విత్‌డ్రావల్ స్లిప్ అందించాడు. అయితే, ఒక సెంట్ విత్ డ్రా చేయడం కుదరదని టెల్లర్ చెప్పడంతో ఫ్లెమింగ్ ప్రతిస్పందన ఆయనను భయపెట్టింది.

 ‘నేను ఇంకోమాట చెప్పాలనుకుంటున్నావా?’ అన్న ఫ్లెమింగ్ వ్యాఖ్యలతో.. తనను ఏదో చేయబోతున్నాడన్న భయంతో సదరు టెల్లర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారొచ్చి, ఫ్లెమింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఫ్లోరిడా దోపిడీ చట్టాలను ఉల్లంఘించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లెమింగ్‌ను డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.


More Telugu News