వైఎస్ ఘాట్ వద్ద తీవ్ర భావోద్వేగం.. జగన్ ను పట్టుకుని విజయమ్మ కంటతడి

  • నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి
  • భార్య భారతితో కలిసి నివాళి అర్పించిన జగన్ 
  • భర్త, కొడుకు, కూతురుతో కలిసి వచ్చిన షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. తన తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ఆయన వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఈ క్రమంలో జగన్ ను ఆలింగనం చేసుకుని విజయమ్మ కంటతడి పెట్టారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్, విజయమ్మ కలిసి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆమెతో పాటు తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కూతురు ఉన్నారు. జగన్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చారు. 








More Telugu News