జింబాబ్వేను భారీ మార్జిన్ తో ఓడించిన టీమిండియా
- నేడు టీమిండియా, జింబాబ్వే రెండో టీ20
- 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా
- మొదట 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసిన టీమిండియా
- లక్ష్యఛేదనలో 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయిన జింబాబ్వే
- చెరో మూడు వికెట్లతో జింబాబ్వే పనిబట్టిన ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్
తొలి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో కంగుతిన్న టీమిండియా... నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఇవాళ జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 100 పరుగుల భారీ మార్జిన్ తో జింబాబ్వేను చిత్తు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా... అభిషేక్ శర్మ (100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ (77 నాటౌట్), రింకూ సింగ్ (48 నాటౌట్) దూకుడు సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 235 పరుగుల భారీ టార్గెట్ తో బరిలో దిగిన ఆతిథ్య జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓపెనర్ వెస్లీ మదివెరే 43, ల్యూక్ జోంగ్వే 33, బ్రయాన్ బెన్నెట్ 33 పరుగులు చేశారు. కెప్టెన్ సికిందర్ రజా (4) మరోసారి స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, అవేష్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జులై 10న జరగనుంది. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు హరారేలోనే జరగనున్నాయి.