జింబాబ్వేతో రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా
- టీమిండియా, జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
- తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమి
- నేడు రెండో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
నేడు టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. నిన్న ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగ్గా... జింబాబ్వే 13 పరుగుల తేడాతో టీమిండియాపై సంచలన విజయం సాధించింది.
తొలి మ్యాచ్ కు వేదికగా నిలిచిన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఇవాళ రెండో మ్యాచ్ కు కూడా ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక మార్పు చేసింది. లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ కు తుదిజట్టులో స్థానం కల్పించింది. ఈ మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు.
టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జులై 6 నుంచి 14 వరకు జరగనుంది. ప్రస్తుతం ఆతిథ్య జింబాబ్వే ఈ సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది.