బీపీ నియంత్రణకు డబ్ల్యూహెచ్ వో సూచనలివే..!

  • ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీ బాధితులే..
  • సాధారణంగా రక్తపోటు లక్షణాలు కనిపించవని హెచ్చరిక
  • సైలెంట్ కిల్లర్ అని, అంతర్గతంగా తీవ్ర నష్టం కలగజేస్తుందని వెల్లడి
రక్తపోటు.. బ్లడ్ ప్రెషర్ (బీపీ) సైలెంట్ కిల్లర్ అని, బయటకు కనిపించకుండా అంతర్గత అవయవాలను తీవ్రంగా దెబ్బతీసే గుణం దీనికి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఇటీవలి సర్వేల ప్రకారం ప్రపంచంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీ బాధితులేనని వెల్లడించింది. బయటకు ఎలాంటి సూచనలు, లక్షణాలు కనిపించకుండా గుండె, మెదడు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని పేర్కొంది. చాలామంది బీపీతో బాధపడుతున్నట్లు తెలియక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురు బాధితులలో ఒక్కరు మాత్రమే రక్తపోటు నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో తరచూ బీపీ పరీక్ష చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ వో నిపుణులు సూచించారు.

వైద్య పరీక్షల్లో బీపీ ఉందని నిర్ధారణ అయితే కంగారుపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడానికి నాలుగు ముఖ్యమైన సూచనలు చెబుతూ వీటిని పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అవేంటంటే.. బీపీ బాధితులు స్మోకింగ్ అలవాటుకు వెంటనే స్వస్తి పలకాలి. అదేవిధంగా, రోజువారీ ఆహారంలో ఉప్పును తగ్గించాలని, రాత్రిపూట కంటినిండా నిద్ర పోవాలని, నిత్యజీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు సూచించారు.


More Telugu News