నీతా అంబానీ భావోద్వేగం.. హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు!
- అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి సంబంధించి సంగీత్ కార్యక్రమం
- ఈ కార్యక్రమంలో రోహిత్, హార్దిక్, సూర్యకుమార్‌లకు ఘన స్వాగతం
- ముగ్గురినీ వేదికపైకి పిలిచి నీతా అంబానీ ప్రశంసలు
- కష్టాలు ఎల్లప్పుడూ ఉండవంటూ హార్దిక్‌ను చూసి నీతా భావోద్వేగం
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ దక్కడంలో కీలకంగా వ్యవహరించిన క్రీడాకారులు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌లకు అనంత్ అంబానీ - రాధిక మర్చెంట్ సంగీత్ వేడుకలో ఘన స్వాగతం లభించింది. ముఖేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టులోనూ ఈ ముగ్గురూ ప్రధాన క్రికెటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురినీ వేదికపైకి ఆహ్వానించి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘కఠిన సమయాలు ఎల్లప్పుడూ ఉండవు. వాటికి ఎదురొడ్డి నిలిచిన వారే ముందుకు సాగుతారు’ అని హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి నీతా అంబానీ అన్నారు. గత ఐపీఎల్‌లో రోహిత్ స్థానంలో ముంబై కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ను టోర్నీ ఆసాంతం ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, హార్దిక్ వ్యక్తిగత జీవితంపైనా పలు వదంతులు వచ్చాయి. భార్య స్టాన్కోవిక్ హార్దిక్ నుంచి విడిపోయిందని వదంతులు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌కు మద్దతుగా నీతా అంబానీ ఈ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు.