నా ఓటమికి రహదారి గోతులే ప్రధాన కారణం: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
- ఈ విషయమై జగన్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన
- భారీ ఓట్ల తేడాతో ఓడిపోయానని ఆవేదన
- అభివృద్ధికి తాను ఖర్చు చేసిన సొంత నిధులు ఇస్తుందో లేదో తెలియదని వ్యాఖ్య
ఎన్నికల్లో తన ఓటమికి రహదారి గోతులే కారణమని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయానని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్‌కు ఎన్నికల ముందు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు తమను తిరస్కరించారని అంగీకరించారు.
‘‘సొంత నిధులు రూ.2 కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు చేశా. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తోందో లేదో తెలియదు. నాడు తెలిసో.. తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు మమ్మల్ని అధికారానికి దూరం చేశారు. ఈ విషయాన్ని మేమంతా అంగీకరించాం. ఇవే తప్పులు చేస్తూ మీరూ అలాంటి ప్రజాతీర్పు కోరుకుంటారా’ అని టీడీపీ నాయకుల్ని ప్రశ్నించారు. ‘‘వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఒకటే చెబుతున్నా. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆహ్వానం లేకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం మీ ఇష్టం’’ అని అన్నారు.