జమ్మూకశ్మీర్‌లో జంట ఎన్‌కౌంటర్లు.. నలుగురు టెర్రరిస్టులు హతం

  • ఫ్రిస్కల్ చిన్నిగమ్, మోడెర్‌గామ్ గ్రామాల్లో పోలీసుల ఉగ్రవాద ఏరివేత చర్యలు
  • భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు, ప్రతిదాడికి దిగిన సైనికులు
  • మొత్తం నలుగురు టెర్రరిస్టులను మట్టుపెట్టిన భద్రతాదళాలు
  • అమరులైన ఇద్దరు సైనికులు, ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతాయన్న ఐజీ
జమ్మూకశ్మీర్‌లో జరిగిన జంట ఎన్‌కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఘటనల్లో భద్రతా దళాలకు చెందిన ఇద్దరు సిబ్బంది కన్నుమూశారు. టెర్రరిస్టులు దాగున్నారన్న సమాచారంతో మోడెర్‌గామ్ గ్రామంలోకి వెళ్లిన భద్రతాదళాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలో కనీసం ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ కాల్పుల్లో లాన్స్‌నాయక్ ప్రదీప్ నయన్ కూడా మరణించారని పేర్కొన్నారు.

లష్కర్ ఉగ్రవాదులు దాగున్నారన్న అనుమానంతో భద్రతా దళాలు ఫ్రిస్కల్ చిన్నిగమ్ గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమవగా 01 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవాల్దార్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను కశ్మీర్ ఐజీ వీకే బిర్ధీ సందర్శించారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతాయని తెలిపారు.


More Telugu News