ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను పరిశీలించిన మంత్రి పవన్ కల్యాణ్
- విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శన
- గార్బేజ్ టు గోల్డ్ పేరిట ప్రదర్శన
- అధికారులకు పలు సూచనలు చేసిన పవన్ కల్యాణ్
విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను ఏపీ పర్యావరణ శాఖ పవన్ కల్యాణ్ తిలకించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 'గార్బేజ్ టు గోల్డ్' పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను పవన్ కల్యాణ్ ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రీసైక్లింగ్ కు ఉపయోగపడని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించరాదని సూచించారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని అన్నారు.
వృక్షాల నుంచి రాలే ఆకులు, ఎండు కొమ్మలను, పొడిచెత్తను తగులబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతుందని, అదే చెత్తను కంపోస్టుగా మార్చితే ఎరువుగా ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థులు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు.