చంద్రబాబుకు 'నా గొడవ' పుస్తకాన్ని బహూకరించిన రేవంత్ రెడ్డి, వెంకటేశ్వరస్వామి పటాన్ని ఇచ్చిన ఏపీ సీఎం

  • కాళోజీ నారాయణరావు రాసిన పుస్తకాన్ని ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి
  • రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి పటాన్ని ఇచ్చిన చంద్రబాబు
  • భేటీలో భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
  • హాజరైన తెలంగాణ సీఎస్ శాంతికుమారి, మరికొందరు అధికారులు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పది అంశాల అజెండాపై వారి మధ్య చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు. భేటీ సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని బహూకరించారు. ఏపీ సీఎంను శాలువతో సత్కరించారు. మరోవైపు, రేవంత్ రెడ్డికి చంద్రబాబు వెంకటేశ్వరస్వామి పటాన్ని బహూకరించారు.

ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి, మరికొందరు అధికారులు పాల్గొన్నారు. ఖమ్మంలోని ఏడు మండలాలు, నీటిలో వాటా, తొమ్మిది, పదో షెడ్యూల్‌లలోని ఆస్తుల పంపకాలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల విభజన, హైదరాబాద్‌లోని భవనాల అప్పగింత తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.


More Telugu News