బిష్ణోయ్ స్పిన్ మ్యాజిక్... జింబాబ్వే 115/9
- టీమిండియా, జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్
- హరారే వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 4 ఓవర్లలో 4 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్
జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టును బిష్ణోయ్ తన స్పిన్ తో హడలెత్తించాడు.
బిష్ణోయ్ 4 ఓవర్లలో 4 వికెట్లు తీయడం విశేషం. 4 ఓవర్లు విసిరిన బిష్ణోయ్ కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అందులో రెండు ఓవర్లు మెయిడెన్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ 2, ముఖేశ్ కుమార్ 1, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు.
జింబాబ్వే బ్యాటింగ్ చూస్తే... వికెట్ కీపర్ క్లైవ్ మడాండే 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. బ్రయాన్ బెన్నెట్ 23, డియాన్ మైర్స్ 23, వెస్లీ మదివెరే 21, కెప్టెన్ సికిందర్ రజా 17 పరుగులు చేశారు.