ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వ్యాఖ్యలకు రవిశాస్త్రి కౌంటర్
- టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా
- వరల్డ్ కప్ నిర్వాహకులు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారన్న మైఖేల్ వాన్
- వాన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడన్న రవిశాస్త్రి
- వాన్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ నెగ్గలేదని ఎద్దేవా
- భారత్ నాలుగు సార్లు ట్రోఫీలు గెలిచిందని వెల్లడి
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ భారత్ అంటే విషం వెళ్లగక్కుతుంటాడన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా టీమిండియాపై అవాకులు చెవాకులు పేలుతుంటాడు.
తాజాగా, టీమిండియా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న నేపథ్యంలోనూ, మైఖేల్ వాన్ అక్కసు వెళ్లగక్కాడు. టోర్నీ నిర్వాహకులు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించాడు. వాన్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించాడు.
మైఖేల్ వాన్ నోటికి అడ్డు అదుపు ఉండదని, అతడి మాటలను భారత్ లో ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నాడు. భారత్ పై వ్యాఖ్యలు చేసే బదులు... వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ జట్టు సెమీస్ లో ఎందుకు ఓడిపోయిందన్న దానిపై అతడు దృష్టి పెడితే మంచిదని రవిశాస్త్రి చురక అంటించాడు.
భారత్ ఇప్పటిదాకా నాలుగు ఐసీసీ ట్రోఫీలు సాధించిందని, ఇంగ్లండ్ రెండు పర్యాయాలు మాత్రమే ట్రోఫీ అందుకుందని తెలిపాడు. కానీ మైఖేల్ వాన్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ నెగ్గలేదని రవిశాస్త్రి ఎద్దేవా చేశాడు.