ఈ డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాలు కలిసిపోవడం తప్ప మరో మార్గం లేదు: పేర్ని నాని
- నేడు హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
- విభజన అంశాలపై చర్చించనున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- ఆసక్తికర ట్వీట్ చేసిన వైసీపీ నేత పేర్ని నాని
నేడు హైదరాబాదులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్య కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజన అంశాలపై ఇరువురు సీఎంలు సమావేశమై చర్చించనున్నారు.
దీనిపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. తెలుగు న్యూస్ చానళ్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటే... ఇవాళ జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనబడుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఈ సాయంత్రం 6 గంటలకు ఇద్దరు సీఎంల సమావేశం ప్రారంభం కానుండగా... ఏపీలో పోర్టులు, టీటీడీ ఆస్తుల్లో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయనుందని... అదే సమయంలో హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పేర్ని నాని ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.