ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

  • జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు
  • జులై 23న కేంద్ర బడ్జెట్
  • ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ 
కేంద్రంలో ఎన్డీయే 3.0 ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా పూర్తి స్థాయి పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. 

నిర్మలా సీతారామన్ తాజాగా ఆర్బీఐ గవర్నర్ తో సమావేశమయ్యారు. బడ్జెట్ కేటాయింపుల అంశంపై చర్చించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఏడోసారి. ఈసారి ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో, రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News