తిరుమల దర్శనంలో తెలంగాణ సిఫార్సు లేఖలపై చంద్రబాబును అడగండి: రేవంత్ రెడ్డికి తుమ్మల లేఖ
- తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకునేలా కోరాలన్న మంత్రి
- మన లేఖలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబును అడగాలన్న తుమ్మల
- కాసేపట్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిల కీలక భేటీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనంలో తెలంగాణ సిఫార్సు లేఖలపై ముఖ్యమంత్రుల భేటీలో కోరాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు.
తిరుమల దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంగా కోరాలని సూచించారు. ఇక్కడి ప్రజాప్రతినిధుల లేఖలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేయాలన్నారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు.