ఆర్మ్ స్ట్రాంగ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: రాహుల్ గాంధీ
- తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్య
- ఫుడ్ డెలివరీ బాయ్స్ రూపంలో వచ్చి నరికి చంపిన దుండగులు
- ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురికావడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్మ్ స్ట్రాంగ్ ను ఆటవిక రీతిలో, దారుణంగా నరికి చంపడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబానికి, స్నేహితులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తమిళనాడు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, నిందితులను త్వరలోనే న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
తమిళనాడు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, నిందితులను త్వరలోనే న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు.