కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఈ నెల 8న విచారణ
- మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సీబీఐ ఛార్జిషీట్
- మద్యం పాలసీ రూపకల్పనలో కవితను ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న సీబీఐ
- ఈ ఛార్జిషీట్‌పై ఎల్లుండి విచారించనున్న రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 8న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మద్యం పాలసీ కేసుపై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. దర్యాఫ్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సీబీఐ పేర్కొంది.
మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.