ఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది మసౌద్
- అల్ట్రాకన్జర్వేటర్ సయాద్ జలీల్‌పై విజయం
- మౌసద్‌కు విజయాన్ని అందించిపెట్టిన హామీలు
- ఆంక్షల వలయం నుంచి బయటపడేస్తానని, హెడ్‌స్కార్ఫ్ నిబంధనను సులభతరం చేస్తామని హామీ
- 30 మిలియన్ ఓట్లలో 16.3 మిలియన్ ఓట్లు మసౌద్‌కే
ప్రముఖ సంస్కరణవాది, హార్ట్ సర్జన్, సుదీర్ఘకాలం చట్టసభ్యుడిగా పనిచేసిన మసౌద్ పెజెష్కియన్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో అల్ట్రాకన్జర్వేటివ్ సయాద్ జలీల్‌పై విజయం సాధించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కుదిపేస్తున్న ఆంక్షలు, ఇటీవల దేశాన్ని కుదిపేసిన హెడ్‌స్కార్ఫ్ చట్టం అమలును సులభతరం చేస్తామన్న హామీలు మసౌద్‌కు విజయం చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 30 మిలియన్ల మంది ఓటుహక్కు వినియోగించుకోగా మసౌద్‌కు 16.3 మిలియన్ ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి జలీల్‌కు 13.5 మిలయన్ ఓట్లు వచ్చాయి.