మొత్తానికి 400 సీట్లు అయితే వచ్చాయి.. కాకపోతే వేరే దేశంలో: బీజేపీని ఉద్దేశించి శశిథరూర్ సెటైర్
- ‘అబ్ కీ బార్ 400 పార్’ కల ఎట్టకేలకు సాకారమైందంటూ ఎక్స్‌లో శశిథరూర్ పోస్ట్
- కాకపోతే వేరే దేశంలో అయిందని బీజేపీకి సెటైర్
- యూకే ఎన్నికల్లో 412 స్థానాల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదంతో ఊదరగొట్టింది. ఈసారి బీజేపీకి 400 సీట్లు దాటుతాయని విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయి. సింగిల్‌గా మెజార్టీ మార్కును కూడా దాటలేకపోయింది. చివరికి తెలుగుదేశం పార్టీ, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ చేయూతతో అధికారంలోకి వచ్చింది. తాజాగా బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ల్యాండ్‌స్లైడ్ విక్టరీ సాధించింది. 650 సీట్లకు గాను 412 సీట్లు గెలుచుకుని తిరుగులేని విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సెటైర్ వేశారు. ‘‘ఎట్టకేలకు ‘అబ్ కీ బార్ 400 పార్’ సాకారమైంది. కాకపోతే వేరే దేశంలో’’ అని ఎక్స్‌లో సెటైర్ వేశారు. దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాలు గెలుచుకోగా, ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది.