బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపు

  • ఈ నెల 9న అమ్మవారి కల్యాణం 
  • ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది
  • నేటి నుంచి ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల 9న అమ్మవారి కల్యాణం జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణం చూడడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది చెప్పారు. ఈ పనుల నేపథ్యంలో టెంపుల్ ముందున్న రోడ్డుపై రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నియంత్రిస్తున్నారు. రోడ్డు ఇరువైపులా క్లోజ్ చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ మార్గంలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్సార్ నగర్ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరించారు. ఎల్లమ్మ కల్యాణం నేపథ్యంలో భక్తుల వాహనాల పార్కింగ్ కోసం నాలుగు చోట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫతేనగర్‌ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైవోవర్‌ బ్రిడ్జి కింద ఇరు వైపులా, నేచర్ క్యూర్ ఆసుపత్రి, ఎస్సార్ నగర్‌లోని రోడ్లు భవనాల శాఖ, అమీర్‌పేటలోని శ్రీ గురుగోబింద్‌సింగ్‌ ప్లే గ్రౌండ్‌లలో పార్కింగ్‌కు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వాహనాల దారి మళ్లింపు ఇలా..
అమీర్‌పేట, బేగంపేట నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్ నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ మీదుగా సోనీ వైన్స్‌, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా పంపిస్తున్నారు.
సనత్‌నగర్‌, ఫతేనగర్‌, బేగంపేట బైపాస్‌ రోడ్ నుంచి వచ్చే వాహనాలను సిక్స్‌ ఫీట్‌ రోడ్డు నుంచి, బల్కంపేట బతుకమ్మ చౌరస్తా మీదుగా ఎస్సార్ నగర్‌, అమీర్‌పేట మీదుగా తరలిస్తున్నారు.


More Telugu News