ప్రధానిగా చివరి ప్రసంగం... రిషి సునాక్ భావోద్వేగం
- ప్రజల ఆగ్రహం తనను తాకిందన్న రిషి సునాక్
- ప్రభుత్వం మారాలని ప్రజలు స్పష్టమైన సందేశమిచ్చారని వ్యాఖ్య
- ప్రజలకు క్షమాపణలు చెప్పిన రిషి
- ఓడిపోయినందుకు పార్టీ నేతలకూ క్షమాపణలు
ప్రధానిగా చివరి ప్రసంగంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఓటమికి ఆయన బాధ్యత వహించారు. పదవి నుంచి దిగిపోవడానికి ముందు ఆయన తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు నిలబడి ప్రధాని హోదాలో చివరి ప్రసంగం చేశారు. ప్రజల ఆగ్రహం తనను తాకిందని భావోద్వేగానికి లోనయ్యారు.
తొలుత మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నానని బ్రిటన్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రధానిగా తన బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించానని భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మారాలని మీరు స్పష్టమైన సందేశం ఇచ్చారని, మీ తీర్పే అంతిమం అన్నారు. మీ ఆగ్రహాన్ని, అసంతృప్తిని నేను పూర్తిగా విన్నాను... ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.
గడ్డు పరిస్థితుల తర్వాత ఇది కష్టమైన రోజు అన్నారు. దేశ ప్రధానిగా సేవలు అందించే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. దేశంలోనే మనది అత్యుత్తమ దేశమన్నారు. ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ నేతలకు క్షమాపణలు
తమ పార్టీలో చాలామంది ఈసారి సభ్యత్వాన్ని కోల్పోయారనీ, ఇది తనను చాలా బాధించిందని రిషి సునాక్ అన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ పార్టీ అధినాయకత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగుతానన్నారు. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న లేబర్ పార్టీ నేత కీర్ స్మార్టర్‌కు ఆయన అభినందనలు తెలిపారు.