కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ లీగల్ నోటీసులు
- తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు పెట్టారని ఆవేదన
- తప్పుడు ప్రచారం చేసినందుకు లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యం... ఇసుకరాళ్ల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలకు గాను తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.