థాంక్యూ... రిషి సునాక్: ప్రధాని మోదీ ట్వీట్
- బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ పరాజయం
- లేబర్ పార్టీకి పట్టం కట్టిన బ్రిటన్ ఓటర్లు
- యూకే ప్రధానిగా మీ సేవలు ప్రశంసనీయం అంటూ సునాక్ ను ఉద్దేశించి మోదీ ట్వీట్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో మరోసారి ప్రధాని కావాలన్న రిషి సునాక్ కలలు భగ్నమయ్యాయి. బ్రిటన్ లో 14 ఏళ్ల పాటు సాగిన కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరదించుతూ... లేబర్ పార్టీ సునామీ విజయం సాధించింది. కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా గద్దెనెక్కనున్నారు.
ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
"థాంక్యూ రిషి సునాక్... యూకే ప్రధానిగా మీ సేవలు ప్రశంసనీయం. మీ హయాంలో భారత్, యూకే సంబంధాలు మరింత బలోపేతం కావడానికి మీరు ఎంతో క్రియాశీలక సహకారం అందించారు. భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి అంతా శుభప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు.