మనమ్మాయిలు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటుండడం అమిత గర్వంగా ఉంది: జగన్
- మరికొన్ని రోజుల్లో ప్రపంచ క్రీడా సంరంభం
- జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ ఒలింపిక్స్-2024
- ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందంలో ఏపీ అథ్లెట్లు జ్యోతి, జ్యోతిక
- ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులను అలరించేందుకు మరికొన్ని రోజుల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్ కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ మహానగరం ఆతిథ్యమిస్తోంది.
ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందంలో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి, దండి జ్యోతిక శ్రీ కూడా ఉన్నారు. దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
మనమ్మాయిలు జ్యోతి యర్రాజి, డి.జ్యోతిక శ్రీ పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం చూస్తుంటే అమిత గర్వంగా ఉందని పేర్కొన్నారు. మీ కృషి, పట్టుదలతో ఇప్పటికే ఏపీకి వన్నె తెచ్చారని జగన్ కొనియాడారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లోనూ పతకాలు గెలవాలన్న మీ లక్ష్యం దిశగా మీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.