ఢిల్లీలో నేడు కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ... కేంద్రమంత్రులతో వరుస భేటీలు
- ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లతో చంద్రబాబు భేటీ
- చంద్రబాబును కలవడం ఆనందాన్నిచ్చిందన్న కేంద్ర మంత్రులు
- కేంద్రమంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కూడా ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో చంద్రబాబు సమావేశమయ్యారు.
చంద్రబాబుతో సమావేశం తమకు ఆనందం కలిగించిందని కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో స్పందించగా, చంద్రబాబు కూడా వినమ్రంగా బదులిచ్చారు.
కేంద్రమంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆలోచనలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి సంపూర్ణ సహాయసహకారాలు లభ్యమవుతాయన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.