కేసీఆర్ గతంలో మాదిరిగానే ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు: ఆది శ్రీనివాస్

  • కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడం వల్లే ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్య
  • పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది ఎవరో అందరికీ తెలుసునన్న కాంగ్రెస్ నేత
  • ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కనుందన్న ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో మాదిరిగానే కేవలం ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కూడా ఆయన స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడం వల్లే ఆ పార్టీ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరారన్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా చేరిన విషయం గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది ఎవరో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్ట్ లోగా రూ.31 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కనుందన్నారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. రైతు భరోసాపై తమ ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలే కనిపించాయని మండిపడ్డారు.


More Telugu News