ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి.. క్లాస్‌రూంలో టీచర్లు గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి ఘటన!
- తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
- వేసవి సెలవులు కావడంతో జూన్‌లో బాలికకు పెళ్లి చేసిన పేరెంట్స్
- ఇటీవల మళ్లీ పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్‌కు వెళ్లిన బాలిక
- ఆమె ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఉపాధ్యాయులకు అనుమానం
- జిల్లా అధికారులు వచ్చి విచారించడంతో వెలుగులోకి ఉదంతం
- పోక్సో చట్టం కింద కేసు నమోదు
బాల్య వివాహాలపై అధికారులు ఎంతో అవగాహన కలిగిస్తున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో సంసార భారం మోపి పసివాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. కాలం మారుతున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో ఓ బాల్య వివాహాం వెలుగులోకి వచ్చింది.
ఆరో తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు పెళ్లాడిన ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉండే బీరప్ప అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి బాలికను పెళ్లి చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో జూన్‌లో బాలికకు పేరెంట్స్ పెళ్లి చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల మళ్లీ పాఠశాలలు ప్రారంభం కావడంతో బాలిక స్కూల్‌కు వెళ్లింది. అయితే, ఆమె ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలికను విచారించడంతో ఆమెకు పెళ్లయిన విషయం బయటకు వచ్చింది. దీంతో అధికారులు బాలికను స్టేట్‌హోంకు తరలించారు. అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బీరప్ప, అతని కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.