తిరుమల శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాలి: బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి
- భూమన కరుణాకర్‌రెడ్డిపై తనకు నమ్మకం లేదన్న భానుప్రకాశ్‌రెడ్డి
- శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలున్నాయన్న బీజేపీ నేత
- హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని మండిపాటు
తిరుమల శ్రీవారి భద్రతపై భక్తుల్లో అనుమానాలున్నాయని, కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని ధ్వజమెత్తారు.
దర్శన టికెట్ల నుంచి ఇంజినీరింగ్ పనుల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలను కమీషన్ల రూపంలో దండుకున్నారని చెప్పారు. గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డిపై తనకు నమ్మకం లేదని, కాబట్టి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.