ఒక నరరూప రాక్షసుడి కోసం వచ్చావంటేనే అర్థమవుతోంది నువ్వేంటో!: జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఫైర్
- 30 కేసులున్న జగన్‌కు 14 కేసులున్న పిన్నెల్లి సౌమ్యుడిగా కనిపించడంలో తప్పులేదన్న ఎంఎస్ రాజు
- ఇప్పటికైనా జగన్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం శుభపరిణామమన్న ఎమ్మెల్యే
- చంద్రబాబు కక్షసాధించి ఉంటే పిన్నెల్లిని మాచర్లలో బట్టలూడదీసి నడిరోడ్డుపై నడిపించి ఉండేవారని వ్యాఖ్య
ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మడకశిర ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎంఎస్ రాజు జగన్ తీరును ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఎంతోమంది దళితుల్ని చంపేస్తే ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్ నేడు ఒక నరరూప రాక్షసుడి కోసం బయటకు వచ్చారని దుయ్యబట్టారు. బీసీల పీకలు కోయించిన పిన్నెల్లి కోసం జగన్ వచ్చారంటేనే ఆయన ఎలాంటి వాడో అర్థమవుతోందని విమర్శించారు.
పులివెందుల ఎమ్మెల్యేకు ఇప్పటికైనా ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం శుభపరిణామమని ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన జగన్‌కు పిన్నెల్లి లాంటి కరుడుగట్టిన క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీలేదన్నారు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని నడిరోడ్డుపై గొడ్డలితో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. 20 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
14 కేసులున్న నరహంతకుడు, భూకబ్జాదారుడు, దౌర్జన్యపరుడు, పేదల్ని పీల్చి పిప్పిచేసిన పిన్నెల్లి లాంటి క్రిమినల్ సౌమ్యుడు, మంచివాడిగా కనిపించాడని ఎద్దేవా చేశారు. 30 కేసులున్న జగన్‌కు 14 కేసులున్న పిన్నెల్లి సౌమ్యుడిగా కనిపించడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు నిజంగా కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే పిన్నెల్లిని మాచర్ల నియోజకవర్గంలో బట్టలూడదీసి కొట్టి నడిరోడ్డుపై పోలీసులు నడిపించి ఉండేవారని రాజు పేర్కొన్నారు.