జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడే పార్థి ముఠా అరెస్ట్.. గాల్లోకి కాల్పులు
- పార్థి ముఠాపై నిఘా పెట్టిన నల్గొండ పోలీసులు
- ఈ తెల్లవారుజామున ముఠాను గుర్తించి వెంబడించిన పెట్రోలింగ్ పోలీసులు
- పెద్ద అంబర్‌పేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద అదుపులోకి
జాతీయ రహదారిపై వరుస చోరీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కత్తులతో ఎదురుదాడికి దిగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట వద్ద ఈ ఘటన జరిగింది.
జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా పార్థి ముఠా ఇటీవల చెలరేగిపోతోంది. వరుస చోరీలపై అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చాక అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కూడా రంగంలోకి దిగారు.
పెద్ద అంబర్‌పేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు నిందితులు కత్తులతో పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు వెనక్కి తగ్గడంతో అరెస్ట్ చేశారు.