దేశ రాజధానిలో బుల్లెట్ బండిపై వచ్చి ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి.. వీడియో ఇదిగో!
- ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో ఘటన
- దారికి అడ్డుగా ఉన్నాడంటూ ఆటోవాలను హాకీ కర్రతో కొట్టిన యువతి
- తలకు బలమైన గాయం కావడంతో రక్తం ధారాపాతంగా కారిన వైనం
- యువతిని అడ్డుకున్న స్థానికులు, నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
ఢిల్లీ వీధుల్లో ఓ యువతి ఉన్మాదిలా మారి రెచ్చిపోయింది. ఓ ఆటోవాలాను పబ్లిక్‌గా హాకీ కర్రతో తలపై రక్తమోడేలా బాదింది. ఈ భయానక ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. నిహాల్ విహార ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
వైరల్ వీడియోలోని క్యాప్షన్ ప్రకారం, స్కూలు పిల్లలను తీసుకుని వెళుతున్న ఓ ఆటోవాలా ట్రాఫిక్ జాం కావడంతో ఆగిపోయాడు. అతడి వెనకే బుల్లెట్ బండిపై వస్తున్న యువతి తప్పుకోమని ఆటోవాలకు సూచిస్తూ పలుమార్లు హారన్ మోగించింది. అయితే, ఆటోవాలా తప్పుకోకపోవడంతో యువతి ఒక్కసారిగా సైకోలా మారి ఆటోవాలాను తన హాకీ కర్రతో ఇష్టారీతిన కొట్టింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో రక్తం ధారాపాతంగా కారింది.
ఆటోవాలాను కాపాడేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. యువతిని అడ్డుకున్నారు. ఈ వీడియో నెట్టింట కూడా సంచలనంగా మారింది. యువతి ఉన్మాదాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాలంలో కూడా ఇలా గూండాగిరి చేసేవారిని అస్సలు ఉపేక్షించకూడదని అన్నారు. వీడియోను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు.