అన్నీ డోర్ డెలివరీ చేసినట్టు చెబుతున్న జగన్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఎవరు డోర్ డెలివరీ చేశారో చెప్పాలి: సోమిరెడ్డి
- నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లిని పరామర్శించిన జగన్
- టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు
- జగన్ హితబోధలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్న సోమిరెడ్డి
ఇవాళ నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు ఎంతో మంచి చేశామని, పథకాలను డోర్ డెలివరీగా అందించామని, మంచి చేసినా ఓడిపోయామని జగన్ అన్నారు.
ప్రజలు చంద్రబాబు మోసపూరిత హామీలకు పడిపోయారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలుపుకోవాలని, ఇప్పటిదాకా పథకాల అమలు ఊసేలేదని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి స్పందిస్తూ... పిన్నెల్లి పరామర్శకు వచ్చిన జగన్ హితబోధలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అన్నీ డోర్ డెలివరీ చేసినట్టు చెప్పుకుంటున్న జగన్... డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఎవరు డోర్ డెలివరీ చేశారో చెబితే బాగుండేదని చురక అంటించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈవీఎం పగులగొడితే తప్పేంటి అంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది... వాటిపై మీకు గౌరవం ఉందా? అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు.