ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం సంతోషం కలిగించింది: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు ప్రధానమంత్రి మోదీ, అనేక మంది కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు
- మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తుందన్న ఖట్టర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. వారితో సమావేశంలో ఏపీ సమస్యలను వివరించారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, చంద్రబాబుతో భేటీపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కావడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా సహాయసహకారాలు అందించనుందో ఈ సమావేశంలో చర్చించినట్టు ఖట్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేలా, రాష్ట్ర అభివృద్ధి శకానికి నాంది పలికేలా ఎన్డీయే సర్కారు ఏం చేయగలదో చంద్రబాబుకు వివరించామని వెల్లడించారు.