భూమ్మీద మనుషులుండే మారుమూల దీవి ఇదే.. నాసా షేర్ చేసిన ఫొటో!
- అట్లాంటిక్ మహా సముద్రం మధ్యలో ఉన్న దీవి
- 300 మంది లోపే జనాభా.. అంతా బ్రిటన్ సంతతి వారే..
- ఈ దీవికి దగ్గరిలోని కేప్ టౌన్ కు దూరమే ఏకంగా 2,787 కిలోమీటర్లు.
కొందరు ఎక్కడో ఏ అడవిలోనో, ఎడారిలోనో చిక్కుకుపోతుంటారు. చుట్టూ మనుషులు కనబడక ఆందోళన పడుతుంటారు. మరి ఎక్కడైనా సుదూరంగా ఒకేచోట ఉండిపోయి.. మరో ఊరికి వెళ్లేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఓ ప్రాంతమే ‘ట్రిస్టాన్ డ కున్హా’. ప్రపంచంలో మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత దూరంగా ఉన్న దీవి ఇదే.
అట్లాంటిక్ మహా సముద్రంలో..
అటు దక్షిణ అమెరికా ఖండానికి, ఇటు ఆఫ్రికా ఖండానికి దాదాపు మధ్యలో ఉండే దీవి ‘ట్రిస్టాన్ డ కున్హా’. ఇది బ్రిటన్ దేశం అధీనంలో ఉంది. ఇక్కడున్న ఒకే ఒక్క టౌన్ పేరు ‘ఎడిన్ బర్గ్ ఆఫ్ సెవెన్ సీస్’. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యాండ్‌శాట్ ఉపగ్రహం ఇటీవల ఈ దీవిని ఫొటో తీసింది. నాసా తమ ‘నాసాఎర్త్’ పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది.
మంచు, పచ్చదనం మధ్య..

- 207 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ‘ట్రిస్టాన్ డ కున్హా’ దీవిలో చాలా భాగం పెద్ద పర్వతమే. దాని శిఖరం కూడా మంచుతో కప్పి ఉంటుంది. మిగతా దీవి అంతా దట్టమైన అడవులతో పచ్చదనం నిండి ఉంటుంది.
- ఇక్కడ జనాభా 300 మంది కంటే తక్కువే. అంతా బ్రిటన్ సంతతి వారే నివసిస్తూ ఉంటారు. దీనికి దగ్గరగా కొన్ని దీవులున్నా.. అవేవీ మనుషులు నివసిస్తున్న ప్రాంతాలు కాదు.
- మిగతా ప్రపంచంతో కలవాలంటే వేల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేయాల్సిందే.
- ట్రిస్టాన్ దీవికి మనుషులు నివసించే దగ్గరి ప్రాంతం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరం. దాని దూరం కూడా ఏకంగా 2,787 కిలోమీటర్లు.
- అందుకే ప్రపంచంలో మనుషులు నివాసం ఉన్న అత్యంత మారుమూల ప్రాంతంగా ట్రిస్టాన్ ను చెబుతారు.