కరకట్టపై ప్రభుత్వ ఫైళ్ల దహనం ఘటనపై... ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- కృష్ణానది కరకట్టపై గతరాత్రి బస్తాల కొద్దీ ఫైళ్ల దహనం
- ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు సమాచారం అందించిన టీడీపీ కార్యకర్త
- బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న పవన్ కల్యాణ్
అమరావతిలో కృష్ణా నది కరకట్టపై ప్రభుత్వ ఫైళ్లు దహనం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి AP16 EF 2596 నెంబరు గల ఇన్నోవా వాహనంలో కరకట్టపైకి వచ్చిన వ్యక్తులు... బస్తాల కొద్దీ ఫైళ్లను తగులబెట్టారు.
ఇది గమనించిన ఓ టీడీపీ కార్యకర్త ఈ విషయాన్ని వెంటనే పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఇతర టీడీపీ నేతలకు తెలియజేశాడు. ఆ ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉండడంతో ఈ విషయాన్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు.
తాజాగా ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దహనం చేసిన ఫైళ్ల వివరాలను వెంటనే తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఫైళ్లను దహనం వెనుక ఉన్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.