మ్యాంగో లస్సీ, మసాలా చాయ్‌ బెస్ట్‌.. జల్‌ జీరా, ఉప్మా వరస్ట్‌!

  • టేస్ట్‌ అట్లాస్‌ ఇండియా సర్వేలో వెల్లడి
  • తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సంస్థ
  • ఫుడ్ కు ఇచ్చిన ర్యాంకులపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ప్రతి ఒక్కరికీ ఓ టేస్ట్‌ ఉంటుంది. కొందరికి కొన్ని రకాల వెరైటీలు బాగా నచ్చితే.. మరికొందరికి అసలు అవి పడనే పడవు. మరి ఎక్కువ మంది ఏ వెరైటీల ఫుడ్‌ ను ఇష్టపడతారనే దానిపై ‘టేస్ట్‌ అట్లాస్‌’ సంస్థ ఇటీవల ఆన్‌ లైన్‌ లో సర్వే చేసింది. దీనికి సంబంధించి బెస్ట్‌ రేటెడ్‌, వరస్ట్‌ రేటెడ్‌ అంటూ పది రకాల ఆహార పదార్థాల టేబుల్‌ ను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పెట్టింది. ఇందులో కొన్ని లోకల్‌ గా పేరుపొందినవైతే.. మరికొన్ని ఆలిండియా స్థాయిలో లెక్కలోకి తీసుకుని రేటింగ్​ కు పెట్టింది. వినియోగదారులు ఇచ్చిన ​రేటింగ్​ లు ఏమేమిటో ఇన్​ స్టా ఖాతాలో పోస్ట్​ చేసింది.
  • మనం ముందే చెప్పుకున్నట్టు.. అందులో కొందరికి నచ్చనివి బెస్ట్‌ రేటెడ్‌ లో.. ఇష్టపడేవి వరస్ట్‌ రేటెడ్‌ లో ఉన్నాయి. దీంతో ఈ లిస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
  • ‘పంటా భాత్ అద్భుతంగా ఉంటుంది. ఈ రేటింగ్స్ ఇచ్చిన వాళ్లకు దాని గురించి ఏమాత్రం తెలియనట్టుంది’ అంటూ కొందరు మండిపడుతున్నారు. 
  • అసలు చాలా మంది ఉప్మాను ఇష్టంగా తింటారని, దానికి ఇలా వరస్ట్ రేటింగ్ రావడమేంటని కామెంట్లు చేస్తున్నవారూ ఎందరో..

బెస్ట్‌ రేటెడ్‌ టాప్‌-10 ఫుడ్స్‌
  • 1. మ్యాంగో లస్సీ (పంజాబ్)
  • 2. మసాలా చాయ్‌
  • 3. బట్టర్‌ గార్లిక్‌ నాన్‌
  • 4. అమృత్‌ సరి కుల్చా (అమృత్ సర్)
  • 5. బట్టర్‌ చికెన్‌ (ఢిల్లీ)
  • 6. హైదరాబాదీ బిర్యానీ
  • 7. షాహీ పనీర్‌ (పంజాబ్)
  • 8. ఛోలే భతురే (ఢిల్లీ)
  • 9. తందూరీ చికెన్‌ (పంజాబ్)
  • 10. కుర్మా

వరస్ట్‌ రేటెడ్‌ టాప్‌-10 ఫుడ్స్‌
  • 1. జల్‌ జీరా
  • 2. గాజక్‌ (నార్త్ ఇండియా)
  • 3. తెంగాయ్‌ సదమ్‌ (సౌతిండియా)
  • 4. పంటా భాత్‌ (ఈశాన్య ఇండియా)
  • 5. ఆలూ బైంగన్‌ (పంజాబ్)
  • 6. థండాయి (రాజస్థాన్; ఉత్తర ప్రదేశ్)
  • 7. అచప్పం (కేరళ)
  • 8. మిర్చి కా సాలన్‌ (హైదరాబాద్)
  • 9. మల్పువా
  • 10. ఉప్మా (తమిళనాడు)


More Telugu News