హథ్రాస్ తొక్కిసలాట కేసులో ఆరుగురి అరెస్ట్... పరారీలో భోలే బాబా
- హథ్రాస్ ఘటనలో 121 మంది మృతి చెందినట్లు తెలిపిన పోలీసులు
- మృతుల్లో 112 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, ఇద్దరు పురుషులు
- 72 గంటల్లో నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
హథ్రాస్ తొక్కిసలాట కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. గురువారం అలీఘర్ ఐజీ శలబ్ మాథూర్ మీడియా సమావేశం నిర్వహించి, కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో 121 మంది భక్తులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, 112 మంది మహిళలు, ఆరుగురు బాలురు, ఒక బాలిక ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన 72 గంటల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలోని 121 మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిందన్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలిపారు. మెయిన్‌పురిలోని ఆశ్రమంలో భోలే బాబా కోసం వెతికినట్లు చెప్పారు. ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.