వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్
- కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బాలికను వేధించినందుకు పోక్సో కేసు నమోదు
- ఇవాళ కర్నూలులో అరెస్ట్ చేసిన పోలీసులు
వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.
ఇదిలాఉంటే.. సుధాకర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్‌కు టికెట్ దక్కింది.