ఆ ఒక్క‌టీ గుర్తుపెట్టుకుంటే మంచిది.. ఏపీ ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా వ్యాఖ్య‌లు!

ఆ ఒక్క‌టీ గుర్తుపెట్టుకుంటే మంచిది.. ఏపీ ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా వ్యాఖ్య‌లు!
  • నేడు వంగవీటి మోహన రంగా 77వ జయంతి 
  • విజయవాడ బందర్‌ రోడ్డులో ఆయన విగ్రహానికి వంగవీటి రాధా నివాళులు
  • ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదన్న రాధా  
  •  ప్రజల కోసం జరిగాయని.. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని వ్యాఖ్య‌
తన తండ్రి వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్‌ రోడ్డులో ఆయన విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే తన తండ్రి రంగా ఆశయమని తెలిపారు. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదన్న వంగ‌వీటి రాధా.. ప్రజల కోసం జరిగాయని పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని చెప్పారు. ప్రజలను ప్రభుత్వాలు విస్మ‌రించ‌కూడ‌ద‌న్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుస‌న్నారు. దానికి ఈ ఎన్నికలే నిద‌ర్శ‌నమ‌న్నారు.

  అందరం కష్టపడి పని చేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమేనని గుర్తు పెట్టుకుంటే మంచిదని రాధా వ్యాఖ్యానించారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రజల కోసమేనని.. బేర సారాల కోసమో, పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావన్నారు.


More Telugu News