రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు: ఎంపీ రఘునందన్ రావు
- రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శ
- ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికివ్వాలో... ఎవరికివ్వకూడదో పరిశీలిస్తామంటున్నారని ఆగ్రహం
- అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చారని ఆరోపణ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారని... ఇప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తు చేశారు.
డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని ఆరోజు చెప్పారని... కానీ అది పోయిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 15 అన్నారని, ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో... ఎవరికి ఇవ్వకూడదో పరిశీలిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన్నారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు.