చరణ్ అన్న, ఉపాసన వదిన ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
- తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఇంటికెళ్లిన జానీ మాస్టర్
- ఇంతకుముందు జానీ మాస్టర్ అడిగిన సహయాన్ని ఇప్పుడు తీర్చిన చెర్రీ దంపతులు
- ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకున్న కొరియోగ్రాఫర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తన బర్త్‌డే సందర్భంగా రామ్ చరణ్‌ను ఇంటికెళ్లి కలిసినట్లు జానీ మాస్టర్ ఈ పోస్టులో పేర్కొన్నారు. ఆ సమయంలో చెర్రీ తనకు ఇచ్చిన మాటను గుర్తు ఉంచుకుని మరీ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
"నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన కొణిదెల వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.
నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టీఎఫ్‌టీటీడీఏలో 500కు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.
మా అందరి తరఫున అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు.