జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
- జగన్‌పై ఉన్న కేసుల మీద తెలంగాణ హైకోర్టులో హరిరామజోగయ్య పిటిషన్
- జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు
- తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాఫ్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.