ఓటీటీలోకి అడుగుపెట్టిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ!
- మే 31న థియేటర్లకు వచ్చిన 'గరుడన్'
- 50 కోట్లకి పైగా రాబట్టిన సినిమా
- ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
- పొలిటికల్ టచ్ తో సాగే యాక్షన్ థ్రిల్లర్
కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చాలా వేగంగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాలలో 'గరుడన్' ఒకటి. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో 20 కోట్లతో నిర్మితమైన సినిమా ఇది. మే 31న విడుదలైన ఈ సినిమా, 50 కోట్ల వసూళ్లను సాధించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో సూరి - ఉన్నిముకుందన్ - శశికుమార్ ప్రధానమైన పాత్రలను పోషించారు. సూరి హీరోగా 'విడుదలై' సినిమాను తెరకెక్కించిన వెట్రి మారన్, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కథ కూడా ఆయన అందించినదే. ఈ సినిమాతో సూరికి మరో భారీ హిట్ పడింది .. ఆయన ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది.
స్వార్థపరుడైన ఒక రాజకీయనాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడటానికి ప్రయత్నిస్తాడు. ఇటు సిటీ మధ్యలోని స్థలాన్ని .. అటు దేవాలయంలో రహస్యంగా దాచి ఉంచిన పెట్టెను కాజేయడాకి ప్రయత్నిస్తాడు. అతణ్ణి అడ్డుకోవడానికి రంగంలోకి దిగిన ముగ్గురు స్నేహితులు ఆ తరువాత బద్ధ శత్రువులుగా మారతారు. అందుకు కారణం ఏమిటనేదే కథ.