సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- వెబ్ సైట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఈ నెల 15 వరకు ఆఫ్ లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
- ఆ తర్వాత నుంచి మాత్రం ఆన్‌లైన్‌లో స్వీకరణ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! సీఎంఆర్ఎఫ్ కోసం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు https://cmrf.telangana.gov.in/ (వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తెలంగాణ వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.
ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే ప్రజల నుంచి వచ్చే వినతులను ఆఫ్ లైన్ ద్వారా అధికారులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నుంచి మాత్రం ఆన్‌లైన్‌లోనే వినతులను స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. అనారోగ్యం బారినపడిన వారు వైద్య చికిత్సకు ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్ఎఫ్‌లో దరఖాస్తు చేసుకుంటారు. పరిశీలన తర్వాత అర్హత కలిగిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.
ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులు ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలపై ఆలోచన చేయాలన్నారు. రెండు వారాల్లో ప్రతి అధికారి ఒక ఫ్లాగ్ షిప్ ఐడియాను ఇవ్వాలన్నారు. ముఖ్య కార్యదర్శులు వారానికి ఓసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు.