ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్
- పవన్ తో తాను అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నానన్న ప్రధాని మోదీ
- ప్రధాని ఇవాళ మా ఎంపీలకు చేసిన సూచనలు అమూల్యం అంటూ పవన్ ట్వీట్
ఇవాళ ఢిల్లీలో జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
"ఇవాళ జనసేన ఎంపీలను కలిశాను. పవన్ కల్యాణ్ గారితో నేను అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాను. ప్రజాసేవ పట్ల ఆయన అనురక్తి, దృఢవైఖరి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. సమాజానికి తన వంతు సేవలు అందించడానికి, దేశ ప్రగతికి తోడ్పాటు అందించడానికి జనసేన పార్టీ కచ్చితంగా ముందుంటుందని నాకు గట్టి నమ్మకం" అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, మోదీ ట్వీట్ పై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినమ్రంగా స్పందించారు.
"జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను కలిసేందుకు మీ విలువైన సమయం కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధాని మోదీ గారూ. ప్రజా సేవ దిశగా మా ఎంపీలకు మీరు ఇచ్చిన అమూల్యమైన సూచనల నుంచి మా జనసేన నేతలు, శ్రేణులు, నేను ఎంతో నేర్చుకుంటాం. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సర్" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.