ఇదే నా సంతకం... నా సంకల్పం: సీఎం రేవంత్ రెడ్డి... ఇదిగో వీడియో
- సైన్ బోర్డుపై 'మార్పు మా ప్రభుత్వ బాధ్యత' అంటూ రాసిన సీఎం
- మాదక ద్రవ్యాలపై పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని వెల్లడి
- మార్పు మత్తు నుంచి చైతన్యానికంటూ రేవంత్ రెడ్డి ట్వీట్
మార్పు... అశాంతి నుంచి శాంతికి, మార్పు అసమర్థత నుంచి సమర్థతకు, మార్పు మత్తు నుంచి చైతన్యానికి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన డ్రగ్స్ నియంత్రణపై అక్కడ ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై 'మార్పు మా ప్రభుత్వ బాధ్యత... రేవంత్' అంటూ ముఖ్యమంత్రి రాసుకొచ్చారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని, తనతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారినపడకుండా కృషి చేస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతోన్న తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామిని అవుతానని సైన్ బోర్డులో పేర్కొన్నారు. దీని కింద ముఖ్యమంత్రి పైవిధంగా సంతకం చేశారు.