అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది... ఎప్పటి నుంచి అంటే...!

  • జులై 20 నుంచి 21 వరకు ప్రైమ్ డే సేల్
  • 48 గంటల పాటు ఆఫర్ల పండగ 
  • ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు రాయితీ
భారీ డిస్కౌంట్ ధరలు, కొత్త ప్రొడక్టులు, ఊరించే ఆఫర్లు... వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ అమెజాన్ ప్రైమ్ డే సేల్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా తన ప్రైమ్ డే సేల్-2024 తేదీలను ప్రకటించింది. జులై 20 నుంచి 21వ తేదీ వరకు 48 గంటల పాటు ఈ ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తారు. ఈ సేల్ లో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రాధాన్యత ఉంటుంది. 

ఇక పలురకాల బ్యాంకు కార్డులపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 10 శాతం వరకు రాయితీ లభించనుంది. అయితే ఈ డిస్కౌంట్ ఈఎంఐ కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 

అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News