ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళా వైద్యురాలు!
- బీహార్‌లోని సరన్ జిల్లాలో ఘటన
- బాధిత వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డు నెంబర్ 12 కౌన్సిలర్
- కౌన్సిలర్‌తో ఐదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్న డాక్టర్
- అతడు పెళ్లికి నిరాకరించడంతో వైద్యురాలి ఘాతుకం
బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బాధిత వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డు నెంబర్ 12 కౌన్సిలర్. ప్రస్తుతం అతన్ని పాట్నా మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేర్పించారు. గత ఐదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో ఆ వైద్యురాలు రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఆమె కూడా అంగీకరించింది. అయితే పెళ్లి చేసుకునేందుకు ఆ వ్యక్తి నిరాకరిస్తూ వస్తున్నాడు. అయితే, చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు ఎలాగోలా అతనిని ఒప్పించింది. పెళ్లి కోసం ఆమె రిజిస్ట్రార్ ఆఫీసుకి వచ్చింది. కానీ బాధిత వ్యక్తి మాత్రం రాలేదు.
దీంతో ప్రియుడి వ్యవహారంపై విరక్తి చెందిన ఆ లేడీ డాక్డర్.. తన ఇంటికి రమ్మని అతన్ని పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్ మర్మాంగాన్ని కోసేసింది. కౌన్సిలర్ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అతను రక్తపు మడుగులో మంచంపై పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
నిందితురాలి వయసు 25 ఏళ్లు. హజిపూర్ ఆమె స్వస్థలం. మధురాలో ఆమె ప్రాక్టీసు చేస్తోంది. బాధిత వ్యక్తి కూడా అవివాహితుడే అని సరన్ జిల్లాలోని మధురా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితురాలిని హత్యాయత్నం నేరంపై అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని చెప్పారు.