721 కోట్ల లీటర్ల కూల్​ డ్రింక్స్​​.. మన వాళ్లు అంత తాగేస్తారా?

  • ఇండియాలో 2024 లో కూల్ డ్రింక్స్ వినియోగంపై అంచనా
  • 2014 నుంచీ పెరుగుతూ వస్తున్న వినియోగం
  • 2027 నాటికి 782 కోట్ల లీటర్లు తాగేస్తారంటున్న అధ్యయనం
ఇంట్లోంచి బయటికి వెళ్లినా.. ఇంటికెవరు చుట్టాలు వచ్చినా.. కాస్త ఎండ వేడిగా ఉన్నా.. కూల్ డ్రింక్ గొంతులో పడాల్సిందే. అలా మారిపోయింది పరిస్థితి. ఇండియాలో ఏటేటా కూల్ డ్రింక్ ల వినియోగం బాగా పెరిగిపోతోంది. ఇక 2024లో మన దేశ ప్రజలు ఏకంగా 721 కోట్ల లీటర్ల కూల్ డ్రింకులను తాగేయబోతున్నారట. స్టాటిస్టా గణాంకాల సంస్థ ఈ మేరకు అంచనాలు వేసింది. గత పదేళ్లలో తాగేసిన కూల్ డ్రింకులు ఎన్ని లీటర్లు? వచ్చే మూడేళ్లలో ఎంత మేర తాగేస్తారనే లెక్కలు పేర్కొంది. అవేమిటో చూద్దామా..

కూల్ డ్రింకుల వినియోగం తీరు ఇదీ..
  • 2014లో 561 కోట్ల లీటర్లు
  • 2015లో 590 కోట్ల లీటర్లు
  • 2016లో 606 కోట్ల లీటర్లు
  • 2017లో 649 కోట్ల లీటర్లు
  • 2018లో 663 కోట్ల లీటర్లు
  • 2019లో 682 కోట్ల లీటర్లు
  • 2020లో 626 కోట్ల లీటర్లు
  • 2021లో 668 కోట్ల లీటర్లు
  • 2022లో 675 కోట్ల లీటర్లు
  • 2023లో 694 కోట్ల లీటర్లు
  • 2024లో 721 కోట్ల లీటర్లు (అంచనా)
  • 2025లో 744 కోట్ల లీటర్లు (అంచనా)
  • 2026లో 766 కోట్ల లీటర్లు (అంచనా)
  • 2027లో 782 కోట్ల లీటర్లు (అంచనా)


More Telugu News